సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

ఏఎన్‌ఎంలను వెంటనే పర్మినెంట్ చేయాలి

ఏఎన్‌ఎంలను వెంటనే పర్మినెంట్ చేయాలి
– కలెక్టరేట్ ముందు రాస్తారోకో

సంగారెడ్డి, నేటి దిశ: రెండవ ఏఎన్‌ఎంలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనీ ప్రతి సెకండ్ ఏఎన్ఎంలను మోసం చేసిందని బహుజనసేన స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ డప్పు రాజు అన్నారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రెండవ ఏఎన్ఎంలు రాస్తారోకో నిర్వహించారు. 15 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తూ తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్న సెకండ్ ఏఎన్ఎం లను మంత్రి హరీష్ రావు తక్షణమే చర్చలకు పిలిచి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సెకండ్ ఏఎన్ఎం ల పై నియమించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం మంచి పద్ధతి కాదని నోటిఫికేషన్ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 16సంవత్సరాల నుంచి కాంట్రాక్టు పద్ధతిలో వైద్య శాఖలో పని చేస్తున్న సెకండియర్లను ప్రభుత్వం పేషరతుగా చర్చలకు పిలవాలని అన్నారు. సెకండ్ ఏఎన్నార్ సమస్యలను పరిష్కరించకుంటే బహుజనసేన ఆధ్వర్యంలో సమ్మెను ఉధృతం చేసి అన్ని విధాలుగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోయిన్ ప్రసాద్, సెకండ్ హ్యాండ్ లో సంఘం జిల్లా అధ్యక్షురాలు శ్యామల, ఏఎన్ఎం లు శ్యామలత, సుజాత, చంద్రకళ, సుక్కమ్మ, మంజుల, శశికళ తదితరులు పాల్గొన్నారు.