ఇంపాక్ట్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణి
ఇంపాక్ట్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణి
నారాయణఖేడ్, నేటిదిశ:వినాయక చవితి పండుగ సందర్బంగా శనివారం నారాయణఖేడ్ పట్టణంలో ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సంఘమేశ్వర ప్రింటింగ్ ప్రెస్ వద్ద మట్టి వినాయకుల ప్రతిమలను పంపిణి చేశారు. ఈ సందర్బంగా బాద్యులు మాట్లాడుతూ..మట్టి వినాయకుల ప్రతిమలను కాకుండా రంగురంగుల ప్రతిమలు పర్యావరణానికి ప్రమాదం అన్నారు.వాటిని చెరువులలో నిమజ్జనం చేసిన నీటిలో కరిగిపోకుండా అట్లాగే ఉంటాయి అన్నారు. మట్టి వినాయకుల ప్రతిమలు నీటిలో వెంటనే కరిగిపోతాయి అన్నారు.ప్రతీ ఒక్కరు మట్టి వినాయకులనే ఏర్పాటు చేయాలి అన్నారు.ఈ కార్యక్రమంలో ఐసిఐ క్లబ్ ఏరియా ఇంచార్జ్ సంతోష్,అధ్యక్షులు శ్వేత,లావణ్య,సభ్యులు సభ్యులు నగేష్,సతీష్,మాణిక్ ప్రభు,కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.