ఇంటికే సీతారాముల కళ్యాణ తలంబ్రాలు నారాయణఖేడ్,నేటిదిశ:ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో భద్రాచలంలోని సీతారాముల కళ్యాణ తలంబ్రాలు నేరుగా ఇంటికి చేరవేస్తున్నామని నారాయణఖేడ్ ఆర్టీసీ పిఆర్ఓ డి.పాండు అన్నారు.ఈ నెల 17న శ్రీరామానవమి సందర్బంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఉపయోగించిన తలంబ్రాలను ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో బుక్ చేసుకున్నవారికి ఇంటి వద్దకే అందజేయబడును అన్నారు.డిపో మేనేజర్ మల్లేశయ్య ఆదేశాల మేరకు నారాయణఖేడ్ లో ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్బంగా ఖేడ్ పట్టణంలోని మైత్రి మరియు కిద్వానీ ఆసుపత్రుల వైద్యులు శ్రీనివాస్,తనుజలు తలంబ్రాలు బుక్ చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఇంచార్జ్ అర్జున్,ఆర్టీసీ సిబ్బంది తదితరులు ఉన్నారు.ఇతర సమాచారం కోసం 9441071134,7382830 800 నంబర్లకు సంప్రదించగలరు అన్నారు.