సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా

అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా
*ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్థి మచ్చెందర్
నారాయణఖేడ్,నేటిదిశ:జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలు తనకు ఎంపిగా ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్థి గుఱ్ఱపు మచ్చెందర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అయన బుధవారం ఇందిరానగర్, కృష్ణాపూర్, నమిలిమేట్,నర్సాపూర్,నారాయణఖేడ్,పంచగామ,నాగిలిగిద్దా,కరస్ గుత్తి,ఇరక్ పల్లి, దామరగిద్ద,మోర్గి, రాణాపూర్ గ్రామాలలో ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..గతం నుండి జహీరాబాద్ పార్లమెంట్ లోని నారాయణఖేడ్ ఏమాత్రం అభివృద్ధి జరుగలేదు అన్నారు. తనకు ఒక్కసారి అవకాశం కల్పిస్తే నిరుద్యోగ నిర్మూలన కోసం కృషి చేస్తానని, ఉపాధి అవకాశాలు కలిస్థానని,ప్రతీ యువతీ,యువకుడు డిగ్రీ వరకు చదివే విధంగా చర్యలు తీసుకుంటానని,ఉద్యోగ కల్పన కోసం కోచింగ్ మరియు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తానని,అందరికి నాణ్యమైన విద్యా, వైద్యం అందుబాటులోకి తీసుకొస్తానని,ప్రతీ పల్లెకు,తాండాలకు రోడ్డు రవాణా సౌకర్యం కల్పిస్థానని,చేతి వృత్తులు,చిరు వ్యాపారులకు, మహిళలకు రుణాలు ఇప్పిస్తానని తెలిపారు.మే నెల 13న జరిగే ఓటింగులో సింహం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటితో గెలిపించాలి అన్నారు.