సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

అమర జవాన్లకు నివాళ్ళు అర్పించిన శివ స్వాములు

అమర జవాన్లకు నివాళ్ళు అర్పించిన శివ స్వాములు

జహీరాబాద్, నేటిదిశ:పుల్వమ దాడి జరిగి ఐదు ఏళ్ళు గడిచిన ఈ సందర్భంగా జహీరాబాద్ పట్టణంలోని బీదర్ చౌరస్తాలో అమరవీరుల స్థూపం వద్ద వారి సేవలను, వారి త్యాగాలను స్మరించుకుంటూ… పట్టణానికి చెందిన శివ స్వాములు నివాళ్ళు అర్పించారు, అనంతరం బిజెపి పార్టీ నాయకులు అశోక్ పాటిల్ మాట్లాడుతూ… సరిగ్గా ఇదే రోజున (2019 ఫిబ్రవరి 14) న పాకిస్థాన్ ముష్కరులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌లను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతితో… జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారని. ఆ దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కి చెందిన 40 సైనికులు బలయ్యారని. జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిపై లేథిపుర (అవంతిపురా సమీపం)లో ఫిబ్రవరి 14న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘాతుకం చోటుచేసుకుందని. జమ్మూ నుంచి సైనికులు శ్రీనగర్‌కు వెళ్తుండగా ముష్కరులు మాటువేసి ఘాతానికి పాల్పడ్డారివారిని ఉపేక్షించు కుండా మన ప్రధాని సాహసోపితమైన నిర్ణయం తీసుకుని దాయాది దేశం లోకి జొచ్చుకెళ్ళి మెరుపు దాడి చేయించిన ఘనత మన ప్రధాని నరేంద్ర మోడీ గారికే దక్కుతుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు, ఆయనతో పాటు శివ స్వాములు సురేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, బండి వెంకట్, టీల్లు, ప్రవీణ్, శేఖర్, శ్రీనివాస్ చారీ, మహేష్, రాజు, శివాజీ, మహిపాల్ రెడ్డి, సాయి, అనిల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు