సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

అభినందనీయుడు పైడి ఎల్లారెడ్డి

అభినందనీయుడు పైడి ఎల్లారెడ్డి
◆ అవధూత గిరి మహారాజ్
◆ శ్రీరాముల వారి ప్రసాదం పంపిణీ ప్రారంభం

జహీరాబాద్, నేటిదిశ:సమాజంలో ప్రతీ ఒక్కరూ ఆధ్యాత్మికత, సేవా భావం కలిగి ఉండాలని వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్న పైడి ఎల్లారెడ్డి అభినందనీయుడని బర్దిపూర్ శ్రీదత్త గిరి మహారాజ్ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ 108 వైరాగ్య శిఖామణి అవధూవతగిరి మహారాజ్, ఉత్తర పీఠాధిపతి మహంత్ డాక్టర్ సిద్దేశ్వర స్వామి అన్నారు. శనివారం పైడి ఎల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో జహీరాబాద్, ఆందోల్, నారాయణఖేడ్, నియోజకవర్గాలకు అయోధ్య శ్రీ రామ జన్మభూమి వారి ప్రసాదాన్ని పంపిణీ కార్యక్రమానికి ప్రారంభించారు. పైడి ఎల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎల్లారెడ్డి మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు అయోధ్య శ్రీ రామచంద్ర ప్రభు ప్రసాదాన్ని అందజేయడం సంతోషిస్తున్నామన్నారు. ప్రతి ఇంటికి ప్రసాదాన్ని అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్టు వెల్లడించారు.ఈ కార్య క్రమంలో ట్రస్ట్ ఇంఛార్జి టి. కృష్ణారెడ్డి, , నాయకులు లక్ష్మి,సంతోష రెడ్డి, చంద్రకాంత్, వెంకటేశం,విశ్వనాథయాదవ్, దుర్గయ్య,సతీష్ శివశక్తి గుప్త, శ్రీనివాస్, ఓంకార్, శివకుమార్,రాములు,విష్ణువర్ధన్ రెడ్డి గ్రామస్థులు పాల్గొన్నారు.